'మహానటి' సినిమా ఎంత గొప్పగా ఉందంటే..!!

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 06:45 PM

'మహానటి' సినిమా ఎంత గొప్పగా ఉందంటే..!!

హైదరాబాద్, మే 14 : అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ "మహానటి" చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోనే దూసుకుపోతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమాలో కీర్తి నటన మహా అద్భుతం అంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు. "మహానటి" సినిమా ఘన విజయ౦ సాధించిన నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి తాజాగా చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "అల్లు అరవింద్ మాతృదినోత్సవ౦ సందర్భంగా ఈ వేడుకను ఏర్పాటు చేయడం అభినందనీయం. సావిత్రి బయోపిక్ అంటే విషాదాంతం కదా.. మరి కమర్షియల్‌గా ఎలా చూపిస్తాడా అని ఆలోచించా.. కాని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతమైన కమర్షియల్ పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజంగా ప్రియాంక, స్వప్న మీరు సాధించిన సక్సెస్ ఎలాంటిదంటే.. మాయా బజార్ చూడలేదా..! శంకరాభరణం చూడలేదా..! బాహుబలి చూడలేదా..! మహానటి చూడలేదా..! అని అడిగేంత గొప్ప సినిమా తీశారమ్మా" అంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

Untitled Document
Advertisements