"మహానటి" సక్సెస్ ప్రోమో అదుర్స్..

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 01:05 PM


హైదరాబాద్, మే 15 : అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ "మహానటి" చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కి౦చిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా ఈ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తన నివాసంలో చిత్ర యూనిట్ మొత్తానికి డిన్నర్‌ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, పరుచూరి గోపాల కృష్ణ, జెమినీ కిరణ్, కె.ఎస్.రామారావు, రమేష్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్ రావు, డా. గోపిచంద్, నందిని రెడ్డి, సంపత్ నంది, త్రినాధ్ రావు నక్కిన, విజయ్ కుమార్ కొండా, కరుణాకరన్, బీవీఎస్.యన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. 'మహానటి' దర్శకులు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్‌లపై ప్రశంసల జల్లు కురిపించారు.

అయితే ఈ కార్యక్రమ౦ అంతటికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తదితరుల మనోభావాలతో ఈ ప్రోమో రూపొందింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారింది. సమ౦త, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలంతా కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఇప్పటికే అమెరికాలో మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.

Untitled Document
Advertisements