దుల్కర్, సమ౦త లను మిసయ్యా.. : విజయ్ దేవరకొండ

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 02:59 PM

దుల్కర్, సమ౦త లను మిసయ్యా.. : విజయ్ దేవరకొండ

హైదరాబాద్, మే 15 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అద్భుత చిత్రం "మహానటి". నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తన నివాసంలో చిత్ర యూనిట్ మొత్తానికి డిన్నర్‌ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. 'మహానటి పార్టీలు'.. సన్మానాలు.. నిన్నరాత్రి- దుల్కర్, సమంతను మిస్సయ్యాను. మా ముఖ్యమైన వ్యక్తి, గురు నాగ్ అశ్విన్ & మల్టీ మిలియనీర్స్ వైజయంతి ఫిల్మ్స్ ను ఆనందపరచినందుకు, ఇండస్ట్రీని ఒక చోటుకు చేర్చినందుకు.. అరవింద్ సార్ థ్యాంక్యూ" అని విజయ్ ట్వీట్ లో ధన్యవాదాలు తెలియజేశారు.Untitled Document
Advertisements