"కాశీ" చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం.

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 06:03 PM


హైదరాబాద్, మే 15 : "బిచ్చగాడు" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో విజయ్‌ ఆంటోని. అమ్మ సెంటిమెంట్ తో అందరిని మెప్పించాడు. ఆయన నుండి మరేదైనా సినిమా వస్తుంది అంటే.. ప్రేక్షకులు ఏదో కొత్తదనం కోరుకుంటారు. తాజాగా విజయ్ ఆంటోని.. ఉదయనిధి దర్శకత్వంలో "కాశీ" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను అన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా అనేక భావోద్వేగాలకు ఈ చిత్రంలో పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకు౦ది.

ఒక సినిమాకు సంబంధించి ఎవరైనా పోస్టర్, సాంగ్స్, ట్రైలర్, టీజర్ లను రిలీజ్ చేస్తారు. కాని విజయ్ ఆంటోని మాత్రం.. ఏకంగా తన సినిమాలోని మొదటి 7 నిమిషాల సినిమాను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు ఎవరు నడవని ఒక సరికొత్త బాటలో ప్రయాణిస్తున్న విజయ్ ఆంటోనికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి..!

Untitled Document
Advertisements