ఇప్పుడది ఫేవరెట్ అయింది : రాజమౌళి

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 06:59 PM

ఇప్పుడది ఫేవరెట్ అయింది : రాజమౌళి

హైదరాబాద్, మే 15 : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల జపాన్ వెళ్లి వచ్చారు. "బాహుబలి" పుణ్యమా మేము వివిధ ప్రాంతాలకు తిరిగే అవకాశం లభించిందంటూ రాజమౌళి అన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తనకు ఎదురైన అనుభవాలను, జపాన్ వాసులు తమపై చూపిన ప్రేమాభిమానాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ.. "మేము జపాన్ నుండి వచ్చి వారం రోజులవుతోంది. "బాహుబలి"కి థాంక్స్. ఈ సినిమా కారణంగానే ఎన్నో దేశాలు తిరిగే ఛాన్స్ వచ్చింది. కానీ మేము తిరిగిన అన్ని దేశాల్లో జపాన్ మాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. వారు ఏర్పాటు చేసిన ఆతిథ్యం మరచిపోలేనిది. వారు మమ్మల్ని చాలా గిఫ్ట్ లతో ఇంటికి పంపించారు" అంటూ ఒక ఫోటోను పోస్ట్ చేశారు.

అంతేకాకుండా వారు ఇచ్చిన గిఫ్ట్ లను ఒక్కొక్కటిగా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాం. మాకు ఇచ్చిన ప్రతీ గిఫ్ట్, ప్రతి ఆర్ట్ చాలా యూనిక్‌గా, అమేజింగ్‌గా అనిపించింది. మీ ఎఫర్ట్‌కి చాలా చాలా థాంక్స్. నిజంగా నన్ను మీరు దీవించినట్టుగా ఫీల్ అవుతున్నాను. థాంక్యూ సోమచ్ జపాన్. లోడ్స్ ఆఫ్ లవ్" అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Untitled Document
Advertisements