గోదావరిలో మునిగిన లాంచీ...

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 07:22 PM

గోదావరిలో మునిగిన లాంచీ...

రాజమహేంద్రవరం, మే 15 : నాలుగు రోజుల క్రితమే గోదావరిలో లాంచీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరవకముందే మరో ఘోరం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్ద మరో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో విహారానికి వెళ్లిన లాంచీ మునిగిపోయినట్లు సమాచారం. ఈత కొడుతూ ఐదుగురు ఒడ్డుకు చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొండమొదలు నుంచి వస్తుండగా మంటూరు వద్ద ఈ లాంచీ నీటమునిగిన సమయంలో సుమారు 50 మంది పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. రంపచోడవరం మన్యం ప్రాంతం పరిధిలో ఈ ఘటన జరగడంతో సమాచారం తెలియడంలో కొంత జాప్యం నెలకొంది.

దేవీపట్నానికి చెందిన అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లాంచీలో సాంకేతిక లోపాలతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Untitled Document
Advertisements