తెలంగాణ రైతులకు శుభవార్త..

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 12:21 PM

తెలంగాణ రైతులకు శుభవార్త..

హైదరాబాద్, మే 16 : రాష్ట్రంలో ప్రతి రైతుకు బీమా సౌకర్యం వర్తింపజేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఇందుకోసం రైతులంతా సభ్యులుగా గ్రూప్‌ ఇన్సూరెన్సు చేయించాలన్నారు. రైతు బీమా పథకం రూపకల్పనపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్‌, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎల్‌ఐసీ అధికారులు పాల్గొన్నారు.

మరణించిన రైతు కుటుంబాలకు బీమా కల్పించడంపై ఇన్సూరెన్సు కంపెనీలతో మాట్లాడి విధివిధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పథకం తీరు ఎలా ఉండాలన్న దానిపై చర్చించి.. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. సమైక్యాంధ్ర రాష్ట్రంలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రైతులూ ప్రయోజనం పొందుతున్నారు. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కు లేనిది కావద్దనే ఉద్దేశంతోనే బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం" అని అన్నారు. రైతులందరికీ "సంయుక్త బీమా" (గ్రూప్‌ ఇన్సూరెన్స్‌) ఉండేలా ప్రీమియం చెల్లించాలన్నారు. దేశంలో భారతీయ బీమా సంస్థ (ఎల్‌.ఐ.సి.)పై ప్రజలకు నమ్మకం ఉందని, దాని ద్వారానే రైతుబీమా పథకాన్ని అమలు చేయాలని సూచించారు.





Untitled Document
Advertisements