స్నేక్‌ ఛాలెంజ్.. సత్తా చాటిన తమన్నా..!!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 03:17 PM

స్నేక్‌ ఛాలెంజ్.. సత్తా చాటిన తమన్నా..!!

హైదరాబాద్, మే 16 : ప్యారిస్ కు చెందిన ప్రముఖ డీజే స్నేక్ విసిరిన ఛాలెంజ్ ను మిల్కీ బ్యూటీ తమన్నా అంగీకరించడమే కాదు ఆ ఛాలెంజ్ లో నెగ్గింది కూడా. తాను నటించిన "మెజెంటా రిడ్డిమ్‌" పాటకు డ్యాన్స్‌ చేయాలని తమన్నాతో ఛాలెంజ్‌ చేశారు. ఈ సవాల్ లో తాను నెగ్గినట్టు తమన్నా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది.

ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా జూయీ వైద్య వ్యవహరించాడని చెబుతూ తన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. వెస్ట్రన్‌, ఇండియన్‌ స్టెప్పులతో తమన్నా వేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక డీజే స్నేక్‌ చూస్తే మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పటివరకు దాదాపు లక్ష మందికిపైగా ఈ వీడియోను లైక్‌ చేశారు. తమన్నా, స్నేక్‌ మంచి స్నేహితులు. ఇటీవల స్నేక్.. "నేను 'బాహుబలి' సినిమా చూశాను. భారతీయ సంస్కృతి, డ్యాన్స్‌లు నాకెంతో స్ఫూర్తినిస్తాయ"ని పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా హీరో కళ్యాణ్ రామ్ సరసన "నా నువ్వే" చిత్రంలో నటిస్తున్నారు.






Untitled Document
Advertisements