ఐపీఎల్‌లో 'అతనొక్కడే'

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 03:27 PM

ఐపీఎల్‌లో 'అతనొక్కడే'

ఇండోర్‌, మే 16 :టీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ఐదు సీజన్లలో 500లకు పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు లిఖించుకున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. 'రన్ మెషిన్' గా తనదైన శైలిలో దూసుకుపోతున్న విరాట్ ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదే కాకుండా ఐపీఎల్ ఆరంభం నుండి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకే ఆడుతున్నాడు.


పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఈ సీజన్‌లో కోహ్లి పరుగుల సంఖ్య 514కి చేరింది. ఈ సీజన్‌కు ముందు కోహ్లీతో పాటు డేవిడ్‌ వార్నర్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) నాలుగుసార్లు 500లకు పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు రైనా ప్రతి సీజన్లోనూ 300లకు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడికి నిలిచాడు.

గత సీజన్లలో కోహ్లి ప్రదర్శన..

>> 2011 557 (16 మ్యాచ్‌లు)
>> 2013 634 (16 మ్యాచ్‌లు)
>> 2015 505 (16 మ్యాచ్‌లు)
>> 2016 973 (16 మ్యాచ్‌లు)

Untitled Document
Advertisements