మరోసారి బాలయ్యతో శ్రియ..!!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 04:56 PM

మరోసారి బాలయ్యతో శ్రియ..!!

హైదరాబాద్, మే 16 : సినిమాల్లో హిట్ పేర్ సూత్రాన్ని బాగా ఫాలో అవుతారు. ఒక హీరోతో తీసిన సినిమా ఘన విజయం సాధిస్తే.. మరలా ఆ జంటను వేరే సినిమాకు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ హీరో బాలకృష్ణ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. బాలకృష్ణ, శ్రియలది విజయవంతమైన జోడీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ నాలుగోసారి జోడీ కడుతుండడం విశేషం.

బాలకృష్ణ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపేశారు. ఈ నెలలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. వి.వి.వినాయక్‌, బాలకృష్ణ ఇదివరకు "చెన్నకేశవరెడ్డి" సినిమా కోసం కలిసి పని చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అదే తరహాలో మరో విజయాన్ని అందుకోవాలన్న కసితో ఇద్దరూ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రియ కథానాయిక. పెళ్లి తర్వాత తెలుగులో శ్రియ ఒప్పుకొన్న చిత్రమిదే కావడం గమనార్హం.

Untitled Document
Advertisements