'బిగ్‌బాస్' లో పార్టిసిపేట్స్ ఎవరంటే..??

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 06:12 PM

'బిగ్‌బాస్' లో పార్టిసిపేట్స్ ఎవరంటే..??

హైదరాబాద్, మే 16 : ఎన్టీఆర్ హోస్ట్‌గా "బిగ్‌బాస్‌" సీజ‌న్- 1 ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా బిగ్‌బాస్‌ సెకండ్ సీజన్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే హైద‌రాబాద్‌- అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో బిగ్‌బాస్ సెట్ కూడా సిద్ధమైపోయినట్లు సమాచారం. బిగ్ బాస్-2ను హీరో నాని హోస్ట్ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అయితే ఈ షోలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వారి పేర్లు ప్రస్తుతం బయటకు వినిపిస్తున్నాయి. తేజ‌స్వి, గాయ‌ని గీతా మాధురి, నటి రాశి, హీరోయిన్ గ‌జాలా, యాంకర్ శ్యామల పార్టిసిపేట్ చేయబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి బిగ్ బాస్ మేనేజ్ మెంట్ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.





Untitled Document
Advertisements