"సాక్ష్యం" ఆడియో ఈవెంట్ కు పవన్..!!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 06:27 PM


హైదరాబాద్, మే 16 : బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "సాక్ష్యం". ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తో౦ది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అయితే చిత్రయూనిట్ ఆడియో వేడుకను జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో ఈ వేడుకను జరపనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ మధ్య కాలంలో సినిమా ఫంక్షన్లకు స్టార్ హీరోలు అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 'రంగస్థలం', నేల టికెట్'.. తదితర ఆడియో వేడుకలకు వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా పవన్ మరో ఈవెంట్ కు హాజరవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనక నిజమైతే కేవలం నెల రోజుల గ్యాప్ లో పవన్ పాల్గొన్న నాలుగో వేడుక కావడ౦ విశేషం. ఒకరకంగా చెప్పాలంటే ఇది రికార్డే.

నిత్యం జనసేన కార్యకలాపాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకుని మరీ పవన్ కళ్యాణ్ ఇలా ఇతర హీరోల సినిమా ఈవెంట్స్ కు వెళ్ళడం చూస్తుంటే పవర్ ఫాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై 'సాక్ష్యం' చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చేంత వరకు ఆగాల్సిందే.

Untitled Document
Advertisements