పొదుపు.. అదుపు చేయడం ఎలా...

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 07:01 PM

పొదుపు.. అదుపు చేయడం ఎలా...

హైదరాబాద్, మే 15 : డబ్బులు ఖర్చు పెట్టడం అంటే చాలా సులువు. కానీ పొదుపు చేయడం చాలా కష్టం. కానీ కొన్ని పరిస్థితుల్లో నగదు అవసరం పడినప్పుడు సర్దుబాటు జరగదు. అందుకు సంపాదించే మొత్తంలో ఇంత అని పక్కన పెట్టడం అలవాటుగా మార్చుకోండి. ఆ తరవాత మిగిలిన దానికి అనుగుణంగానే మీ ఖర్చు ఉండాలి. మరో పనీ చేయొచ్చు. నెలజీతం చేతికి అందడానికి ముందే మీ ఖర్చుల వివరాలు పక్కాగా రాసుకోవాలి. వాడిన ప్రతిరూపాయినీ ఎందుకోసం ఉపయోగిస్తున్నారో కూడా ఓ చోట నమోదు చేసుకోండి. నెల తిరిగేసరికి...మీ ఖర్చులే కాదు వృథాపైనా అవగాహన వస్తుంది. అప్పుడే ఎక్కడ పొదుపు చేయాలో అర్థమవుతుంది.


>> తీరిక ఉన్నా.. చేతినిండా డబ్బు ఉన్నా.. స్నేహితులతో కలిసి కొనుగోళ్లకు వెళ్లిపోతున్నారా. దానివల్ల ఖర్చు అదుపు తప్పుతుంది. అందుకే కొనుగోళ్లకు వెళ్లడానికి ముందే కచ్చితంగా మీ ప్రణాళిక ఎంతో నిర్ణయించుకోండి.

>> ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు క్రెడిట్‌ కార్డు ద్వారానో, వాయిదాల పద్ధతినో ఎంచుకోవడం బాగానే ఉంటుంది. దానికి బదులు డబ్బు పొదుపు చేసి అప్పుడు కొనండి. అదనపు భారం, రుసుములూ పడకుండా ఉంటాయి. ఖర్చూ అదుపు తప్పకుండా ఉంటుంది.





Untitled Document
Advertisements