మరోసారి గోపిచంద్ తో అనుష్క..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 11:55 AM

మరోసారి గోపిచంద్ తో అనుష్క..!!

హైదరాబాద్, మే 17 : లేడి ఓరియె౦టెడ్ చిత్రాలకు పెట్టింది పేరు హీరోయిన్ అనుష్క. ఈ మధ్య కాలంలో కమర్షియల్ చిత్రాలకు, గ్లామర్ రోల్స్ కు కాస్తంత దూరంగా ఉన్నారు. ఇటీవల అనుష్క ప్రధాన పాత్రలో నటించిన "భాగమతి" చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. తన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధుల్ని చేసింది. ఈ చిత్రం తర్వాత అనుష్కకు అన్ని అటువంటి క్యారెక్టర్స్ రావడంతో ఏ సినిమాకు సైన్ చేయలేదు.

ఈ మధ్య కాలంలో స్వీటీ ఏ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది లేదు. ఈ నేపథ్యంలో అనుష్క కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసిందంటూ "నా నువ్వే" సినిమా దర్శకుడు అనౌన్స్ చేశారు. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్.. విజయ్ నిర్మించబోయే సినిమాలో అనుష్క నటించనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో హీరోగా గోపీచంద్ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇది వరకే ఓ సినిమాలో నటించారు.

చాలా కాలం తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుంది. యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనుష్క సైన్ చేయడం విశేషం. ప్రస్తుతం దర్శకుడు జయేంద్ర.. కళ్యాణ్ రామ్, తమన్నా లతో "నా నువ్వే" సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తర్వాత అనుష్కతో చిత్రం పట్టాలేక్కే అవకాశం ఉంది.

Untitled Document
Advertisements