ఆమె లేకుండా సీక్వెల్ ఎలా ఆశిస్తారు..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 12:55 PM

ఆమె లేకుండా సీక్వెల్ ఎలా ఆశిస్తారు..!!

హైదరాబాద్, మే 17 : అతిలోక సుందరి దివంగత తార శ్రీదేవి.. అనిల్ కపూర్ కలిసి నటించిన సినిమా "మిస్టర్ ఇండియా". ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శేఖర్‌ కపూర్‌.. నిర్మాత బోనీ కపూర్ సీక్వెల్ తీయాలని అనుకున్నారు. తమ నిర్ణయాన్ని శ్రీదేవి అంగీకరించింది. అయితే హఠాత్తుగా శ్రీదేవి అకాల మరణంతో అంతా తలకిందులైంది. అయితే శ్రీదేవి స్థానంలో మరో హీరోయిన్ ను పెట్టి "మిస్టర్‌ ఇండియా 2" తీసే ప్రయత్నాలు చేస్తున్నారా? అని దర్శకుడు శేఖర్‌ కపూర్‌ను మీడియా ప్రశ్నించింది.

ఇందుకు శేఖర్ కపూర్ స్పందిస్తూ.. "శ్రీదేవి లేకుండా 'మిస్టర్‌ ఇండియా'కు సీక్వెల్‌ తీస్తే సినిమాకు అర్థమే ఉండదు. శ్రీదేవి లేని 'మిస్టర్‌ ఇండియా 2' అంటే.. తాజ్‌మహల్‌ లేని ఆగ్రాతో సమానం. 'మిస్టర్‌ ఇండియా' అంటే అనిల్‌ కపూర్‌, శ్రీదేవి, అమ్రీశ్‌పురి. వీరిలో ఇద్దరు మన మధ్యలేరు. అలాంటప్పుడు సీక్వెల్‌ ఎలా ఆశిస్తారు? సినిమా తీయకూడదని నేను, బోనీ నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఈ సినిమా తీయాలని బోనీ నిర్ణయించుకుంటే నేను మాత్రం దర్శకత్వం వహించను. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవితో పాటు మా కలలు కూడా వెళ్లిపోయాయి. ఆ కలల్లో 'మిస్టర్ ఇండియా 2‌'ఒకటి" అంటూ ఆవేదనతో చెప్పుకొచ్చారు.

Untitled Document
Advertisements