తమిళంలో 25న రానున్న "భరత్"..

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 01:20 PM

తమిళంలో 25న రానున్న

హైదరాబాద్, మే 17 : ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన "భరత్ అనే నేను" చిత్రం ప్రేక్షకాధారణ పొందిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఈ సినిమా తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

చెన్నైలో దాదాపు 20పైగా థియేటర్లలో ఈ సినిమాను తెలుగులోనే రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించి తమిళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. "భరత్‌ ఎనుం నాన్‌" అనే పేరుతో ఈనెల 25వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది.





Untitled Document
Advertisements