ఉతికేందుకు పద్ధతుంది..!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 01:25 PM

ఉతికేందుకు పద్ధతుంది..!

హైదరాబాద్, మే 15 : ఒక్కో రకం దుస్తులకి ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రంగు వేలిసిపోవడం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.

>> నీలిరంగు ముదురు డెనిమ్ ప్యాంట్లను చల్లని నీటితో ఉతకాలి. అదే తెలుపు, ఇతర రంగులైతే గోరు వెచ్చని నీరు వాడాలి. వీటిని నీడ పట్టున ఆరేస్తే మంచిది.

>> ముదురు నీలిరంగు నూలు దుస్తులకు చల్లటి నీరు వాడాలి. లేత, తెలుపు, రంగు అయితే వేడినీటితో ఉతకడం మంచిది.

>> చాలా మంది దుస్తులను ఒకసారి మడతపెట్టి మరోసారి వాడుతారు. మిగిలినవి ఎలా ఉన్న.. లెనిన్ తరహా మాత్రం ఎప్పటికప్పుడు ఉతికేయాలి. లేదంటే చెమట కారణంగా వాటిలో ఫంగస్ చేరుతుంది.

>>క్రీడాకారులు వేసుకునే దుస్తులూ, వ్యాయామానికి వాడే రకాల్ని చల్లటినీటిలో ఉతకాల్సి ఉంటుంది. ఒక వేళా వాటిపై రేయాన్ అని రాసి ఉంటే.. బ్లీచింగ్ వాడకూడదు. మెలితిప్పి పిండకూడదు.

>> పట్టు, సిల్క్ రకాలను చల్లని నీటిలో ఉతకాలి. కానీ పిండకూడదు.





Untitled Document
Advertisements