కర్ణాటక ఫలితాలు నా సినిమాలాగే ఉన్నాయి : మంచు విష్ణు

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 02:59 PM

కర్ణాటక ఫలితాలు నా సినిమాలాగే ఉన్నాయి : మంచు విష్ణు

హైదరాబాద్, మే 17 : గత రెండు మూడు రోజులుగా ఎంతో ఉత్కంఠగా సాగిన కర్ణాటక ఎన్నికలలో చివరికి భాజపాకే పీఠం దక్కింది. ఎన్నో అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక ఎన్నికలపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ ఎన్నికలపై స్పందించారు.

తాజాగా.. కన్నడనాట ఎన్నికలు, ఫలితాలపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎన్నికల తీర్పు తాను నటిస్తున్న "ఓటర్" సినిమాలాగే ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో.. "వాట్ ఎ ట్విస్ట్ సర్ జీ.. కర్ణాటక తీర్పు ఇంచుమించు నేను నటిస్తున్న 'ఓటర్' సినిమాలాగే ఉంది" అని ట్వీట్ చేశాడు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'ఓటర్' చిత్రానికి జీఎస్‌. కార్తిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

గతేడాది నవంబర్‌లో విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గతేడాది డిసెంబర్‌లోనే విడుదల చేయాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. విష్ణుకు జోడీగా సురభి నటిస్తున్నారు. అయితే విష్ణు తాజా ట్వీట్ తో ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ ఏంటా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Untitled Document
Advertisements