చర్మసంరక్షణకు చిట్కాలు..

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 03:01 PM

చర్మసంరక్షణకు చిట్కాలు..

హైదరాబాద్, మే 17 : ఎన్నో పనులు... ఎంతో ఒత్తిడి.. ప్రస్తుత కాలంలో అందరూ సంపాదించాలన్న కోరికతో కొన్ని విషయాలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మహిళలకు చర్మసంరక్షణకు ఖాళీ దొరకదు. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

>> తరచూ ఎండలో తిరిగే వారి చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే రోజూ స్నానం చేయడానికి ముందు పెసరపిండీ, పెరుగూ, తేనె కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. చర్మం నునువుగా మారుతుంది.

>> ఎండా, దుమ్మూ, ధూళి వంటివి జుట్టుని నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఇలా అనిపించినప్పుడు కోడిగుడ్డు తెల్లసొనకు రెండు చెంచాల పుల్లటి పెరుగూ, పది మందారాకులను కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా నిగనిగలాడుతుంది.

>> జుట్టూ, చర్మం మాత్రమే అందంగా ఉంటే సరిపోతుందా! చేతులూ కాళ్లూ కూడా మెరిసిపోవాలిగా. దానికోసమూ ఇంట్లో ప్రయత్నించొచ్చు. ముందుగా అరబకెట్‌ గోరువెచ్చని నీళ్లల్లో రెండు చెంచాల షాంపూ వేసి పాదాలను పదిహేను నిమిషాలు అందులో ఉంచాలి.

>> ఆ తరవాత ప్యూమిక్‌ రాయితో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చక్కెరా, సెనగపిండీ పాలూ, తేనె కలిపిన మిశ్రమాన్ని పాదాలకు పట్టించి, అది పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. పెడిక్యూర్‌ చేయించుకున్నట్లే పాదాలు కోమలంగా కనిపిస్తాయి. ఇదే పూతను చేతులకూ రాసుకోవచ్చు.





Untitled Document
Advertisements