ఐశ్వర్య కు ఇష్టమైన నటుడెవరో తెలుసా..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 03:27 PM

ఐశ్వర్య కు ఇష్టమైన నటుడెవరో తెలుసా..!!

ముంబై, మే 17 : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌.. ఇటీవల ఐష్‌ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తన కుమార్తె ఆరాధ్యతో కలిసి మెరిశారు. తల్లీకూతుళ్లిద్దరూ కేన్స్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐష్ ఆ వేడుకలను ముగించుకొని ముంబైకి చేరుకున్నారు. అయితే ఈ అందాల సుందరితో ఒక్కసారైనా నటించాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటిది మరి ఐష్ కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా..? ఇంకెవరు ఆమె భర్త అభిషేక్ బచ్చన్. వీరిద్దరూ కలిసి ఇదివరకు పలు సినిమాల్లోనే నటించారు.

ఈ సందర్భంగా ఐష్ మాట్లాడుతూ.. "నాకు ఇష్టమైన నటుడు నా భర్త అభినే. మేమిద్దరం జంటగా నాలుగైదు సినిమాల్లో నటించాం. అభి స్టార్ కుమారుడు అయినప్పటికీ ఆ గర్వం ఉండదు. ముక్కుసూటి మనిషి. అదే అభిలో నాకు నచ్చిన విషయం. అభి నా మనిషి. ఇప్పటికీ మా ఇద్దరినీ సినిమాలో తీసుకోవడానికి దర్శకులు మంచి స్క్రిప్ట్‌లతో వస్తున్నారు. ఇద్దరం కలిసి ఓ సినిమా చేయబోతున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాం" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్‌ "ఫ్యానే ఖాన్‌" చిత్రంలో నటిస్తున్నారు.

Untitled Document
Advertisements