మహిళా ఐపీఎల్ జట్లు వెల్లడించిన బీసీసీఐ

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 05:07 PM

మహిళా ఐపీఎల్ జట్లు వెల్లడించిన బీసీసీఐ

ముంబై, మే 17 : బీసీసీఐ మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్‌ తరహాలో ఈ నెల 22న ఒక టీ20 మ్యాచ్‌ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. భారత అమ్మాయిలతో పాటు విదేశీ క్రికెటర్లు పాల్గొనే ఈ మ్యాచ్‌లో పోటీ పడే రెండు జట్లకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన సారథ్యం వహించనున్నట్లు ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా వెల్లడించారు. తాజాగా బీసీసీఐ జట్ల పేర్లను, జట్టు సభ్యులను వెల్లడించింది.

మొత్తం 26 మంది క్రీడాకారిణిలు ఈ మ్యాచ్‌కు చేశారు. వీరిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌కు చెందిన 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా సారథి మెక్‌లానింగ్‌ కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టులో ఈమెకు స్థానం దక్కింది. ఐపీఎల్‌ ట్రయల్‌ బ్రేజర్స్‌, ఐపీఎల్‌ సూపర్‌ నోవాస్‌గా ఈ జట్లకు పేర్లు పెట్టారు.

ఈ నెల 22న వాంఖడే మైదానంలో 2.30గంటలకు మహిళల టీ-20 నిర్వహించనున్నారు. తర్వాత ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాత్రి 8గంటలకు క్వాలిఫయర్‌-1 జరగనుంది.

ఐపీఎల్‌ ట్రయల్‌ బ్రేజర్స్‌: స్మృతి మంధాన(కెప్టెన్‌), అలిసా హీలీ(వికెట్‌ కీపర్‌), సుజె బేట్స్‌, దీప్తి శర్మ, బెత్‌ మూనీ, రోడ్రిక్స్‌, డానియల్‌ హాజెల్‌, శిఖా పాండే, లీ టహుహు, జులన్‌ గోస్వామి, ఏక్తా బిస్ఠ్‌, పూనమ్‌ యాదవ్‌, హేమలత.

ఐపీఎల్‌ సూపర్ ‌నోవాస్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), మిథాలీ రాజ్‌, మెక్‌లానింగ్‌, సోఫీ డివైన్‌, ఎలిసన్‌ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోన మెశ్రమ్‌, పూజా, మేగన్‌ స్కౌట్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, అనూజ పాటిల్‌, తానియా భాటియా(వికెట్‌ కీపర్‌).

Untitled Document
Advertisements