ట్రెండింగ్ లో సాహో' షూటింగ్ ఫొటోస్..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 05:12 PM

ట్రెండింగ్ లో సాహో' షూటింగ్ ఫొటోస్..!!

హైదరాబాద్, మే 17 : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. "సాహో" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. అ మధ్య కాలంలో ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి.

తాజాగా నటుడు అరుణ్‌ విజయ్‌ షూటింగ్ స్పాట్ లో కొన్ని ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. షూటింగ్‌లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ఫొటోలు కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంతేకాదు‌ ట్రెండింగ్‌లో కూడా చేరాయి. భారీస్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ ఫొటోలను చూస్తే తెలుస్తోంది. దుబాయ్ లో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది చిత్ర యూనిట్.

కేవలం యాక్షన్ సన్నివేశాలకే భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక వార్త వినిపించింది. ఈ యాక్షన్ ఘట్టం సినిమాకే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, ఎవ్లిన్‌ శర్మ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.Untitled Document
Advertisements