ఆ కాలంలోనే ల్యాప్ టాప్.. వైఫై.. ప్రూఫ్ ఇదిగో..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 05:27 PM

ఆ కాలంలోనే ల్యాప్ టాప్.. వైఫై.. ప్రూఫ్ ఇదిగో..!!

హైదరాబాద్, మే 17 : 1957లోనే భారతీయులు తొలి ల్యాప్ టాప్ ను చూపించారని.. అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతేకాదు వైఫై, వీడియో చాటింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇదిగో ప్రూఫ్ అంటూ.. "మాయాబజార్" చిత్రంలో సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి పాడిన వీడియో లింక్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అలనాటి పౌరాణిక చిత్రం 'మాయాబజార్' చిత్రంలోని ఓ సీన్ ను నాగ్ పోస్ట్ చేస్తూ.. 'డోంట్ మిస్ ఇట్' అని వ్యాఖ్యానించారు.

ఈ వీడియోలో శశిరేఖగా నటించిన సావిత్రి, తన మనసులోని కోరికను చూపించే విధంగా 'నీవేనా నను తలచినది' అని పాడుతూ కనిపించింది. తాజాగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన "మహానటి" చిత్రంలోనూ ఈ సన్నివేశాన్ని వాడారు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ అద్బుతంగా నటించగా.. ఆమె భర్త జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ నటించారు. మే9న విడుదలైన ఈ చిత్రం భారత్‌తో పాటు ఓవర్సీస్ లోనూ దూసుకుపోతోంది.Untitled Document
Advertisements