అవును పేరు మార్చుకున్నా.. : సోనమ్

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 05:51 PM

అవును పేరు మార్చుకున్నా.. : సోనమ్

హైదరాబాద్, మే 17 : ప్రముఖ స్టార్ హీరో అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్ ఇటీవల పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన గంటకే ఆమె తన పేరును "సోన‌మ్ కె. అహుజా"గా మార్చేసింది. ఎక్కువగా స్త్రీవాదం గురించి మాట్లాడే సోన‌మ్ ఇలా చేయ‌డం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ విషయంపై సోనమ్ మీడియాతో మాట్లాడింది.

"అవును.. నేను ఫెమినిస్ట్‌ను. నాకు న‌చ్చిన‌ట్టు నేను బ‌తుకుతాను. పెళ్లి త‌ర్వాత కూడా నా జీవితంలో మార్పులేవీ రాలేదు. నా పేరు నాకు న‌చ్చినట్టుగా మార్చుకున్నాను. నా పేరులో మా నాన్న పేరుతో పాటు నా భ‌ర్త పేరు కూడా ఉండాల‌ని అనుకున్నాను. అందుకే 'సోన‌మ్ కె.అహుజా'గా మార్చుకున్నాను. నా పేరు గురించి ఇతరులు ఏమ‌నుకుంటారో నాకు అన‌వ‌స‌రం. నా జీవితానికి సంబంధించిన నిర్ణ‌యాల‌న్ని నేనే తీసుకుంటా. తుపాకీ గురిపెట్టి నా చేత ఎవరు ఏ ప‌నీ బ‌ల‌వంతంగా చేయించ‌రు. నా భ‌ర్త కూడా పెళ్లి త‌ర్వాత త‌న పేరును 'ఆనంద్ ఎస్‌. అహుజా'గా మార్చుకున్నారు. ఈ విషయంపై ఎవరు మాట్లాడరెందుకు" అంటూ వెల్లడించింది.

Untitled Document
Advertisements