"ఎన్టీఆర్" బయోపిక్ లో రానా..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 06:16 PM


హైదరాబాద్, మే 17 : దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ ను నందమూరి బాలకృష్ణ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ రూపొందించాల్సి ఉంది కాని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుండి తేజ తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా విషయమై బాలకృష్ణ చాలా మందిని సంప్రదించారు. చివరికి ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా కీలక పాత్రలో ప్రముఖ కథానాయకుడు రానా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాత్రలో రానా కనిపిస్తాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇదివరకే రానా 'లీడర్' సినిమాలో సీఎంగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

ఇదివరకే ఈ విషయంపై వార్తలు వచ్చినప్పటికీ తాజాగా రానా ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే 28 వ తేదీ వరకు ఆగాల్సిందే.

Untitled Document
Advertisements