డబ్బింగ్ మొదలు పెట్టిన మెగా అల్లుడు..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 06:40 PM

డబ్బింగ్ మొదలు పెట్టిన మెగా అల్లుడు..!!

హైదరాబాద్, మే 17 : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు వెండి తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. చిరు చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కల్యాణ్‌కు జోడీగా "ఎవడే సుబ్రమణ్యం" ఫేమ్ మాళవిక నాయర్ నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. సింగిల్ షెడ్యూల్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులను మొదలెట్టింది చిత్ర బృందం. కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోని రీసెంటుగా మీడియాకి విడుదల చేశారు. ఈ సినిమాను ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు రాకేశ్ శశి భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. "బాహుబలి" లాంటి ప్రతిష్టాత్మక సినిమాకు కెమెరా మ్యాన్‌గా పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.

Untitled Document
Advertisements