బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముందుకు కదిలేనా..!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 06:51 PM

బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముందుకు కదిలేనా..!

ముంబై, మే 17: మోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశ ప్రగతికి ఎన్నో పథకాలు చేపట్టారు. వాటిలో ముఖ్యమైనది అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ముందుకు సాగే సూచనలు కనిపించటలేదు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములిచ్చేందుకు మహారాష్ట్ర, గుజరాత్ రైతులు సుముఖంగా లేరు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల రైతుల మధ్య వివాదం రేగింది. దీంతో మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుకు కష్టాలు తప్పేలా లేవు. ఇండియా , జపాన్ సంయుక్తంగా అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్మించ తలపెట్టాయి.

ఇందుకోసం భూసేకరణ ప్రారంభమైంది. అయితే నష్ట పరిహారం విషయంలో మహారాష్ట్ర, గుజరాత్ రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు నష్టపరిహారం తక్కువగా ఉందని చెప్తుండగా, మరికొందరు తమ భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2023నాటికి పూర్తవ్వాల్సి ఉంది. అహ్మదాబాద్-ముంబై దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి 2017 సెప్టెంబర్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేశారు.





Untitled Document
Advertisements