డబ్బింగ్ చెప్పేసుకున్న మరో హీరోయిన్..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 06:57 PM

డబ్బింగ్ చెప్పేసుకున్న మరో హీరోయిన్..!!

హైదరాబాద్, మే 17 : సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "స‌మ్మోహ‌నం". శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీరావు హైద‌రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. టీజర్ చాలా బాగుందంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కోసం అదితిరావు హైద‌రి తెలుగు నేర్చుకుని సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది. భాష తెలిస్తేనే భావాలను స్పష్టంగా పలికించగలమనీ, భాషపై పట్టు వున్న కథానాయికలు ఎక్కువకాలం పాటు ఈ రంగంలో మనుగడను కొనసాగించగలుగుతారని కథానాయికలు భావిస్తున్నారు. ఈ కారణంగా హీరోయిన్ అదితీ తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే సమంత.. రకుల్.. రాశీ ఖన్నా.. తెలుగు నేర్చుకుని తమ పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

Untitled Document
Advertisements