రెండు నెలల తర్వాత.. ఇర్ఫాన్ ఖాన్..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 07:17 PM

రెండు నెలల తర్వాత.. ఇర్ఫాన్ ఖాన్..!!

ముంబై, మే 17 : బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్.. రెండు నెలలుగా దీని కోసం చికిత్స తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కార్వాన్" మూవీతో దుల్కర్ సల్మాన్, మిథిలా హీరో హీరోయిన్ లుగా బాలీవుడ్ కు పరిచయం కానున్నారు. అదేంటి అని ఆలోచిస్తున్నారా.! దుల్కర్ మలయాళీ కాగా.. మిథిల మరాఠీ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ.

వీరిద్దరినీ విష్ చేసేందుకు దాదాపు రెండు నెలల తర్వాత ఇర్ఫాన్ తన ట్విటర్ అకౌంట్‌ని ఓపెన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేస్తూ.. "బిగినింగ్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ కొనలేనంత ఇన్నోసెంట్‌గా ఉంటాయి. కార్వాన్‌లో జాయిన్ అవుతున్నందుకు దుల్కర్‌కి, మైపాల్కర్‌కి నా బెస్ట్ విషెస్. 'టు కార్వాన్స్' నేను, మూవీ" అంటూ ఇర్ఫాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సినిమాలోని స్టోరీ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.Untitled Document
Advertisements