కర్ణాటకలో ప్రజాస్వామ్యం నెగ్గింది: రజినీ కాంత్

     Written by : smtv Desk | Sun, May 20, 2018, 03:12 PM

కర్ణాటకలో ప్రజాస్వామ్యం నెగ్గింది: రజినీ కాంత్

చెన్నై, మే 20 : ఎన్నో ఉత్కంఠ రాజకీయ పరిణామాల మధ్య నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో కుమారస్వామి ఈ నెల 23న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఈ అంశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్‌ స్పందిస్తూ... ప్రజాస్వామ్యం నెగ్గిందని అన్నారు

"నిన్న కర్ణాటకలో జరిగిన అనూహ్య పరిణామం చూసి ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకున్నా. బలనిరూపణలో నెగ్గడానికి గవర్నర్‌ 15 రోజులు సమయం ఇవ్వడం, అందుకు బీజేపీ మరింత సమయం కోరడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్లుగా ఉంది. బల నిరూపణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ధన్యవాదాలు. ఆ తీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది’ అని సూపర్ స్టార్ వ్యాఖ్యానించారు.

తమిళనాడులో 2019లో జరగబోయే ఎన్నికల గురించి రజనీ మాట్లాడుతూ.. "ఎన్నికలు ప్రకటించినప్పుడు నేను పోటీ చేస్తానా? లేదా? అన్న విషయాన్ని వెల్లడిస్తాను. నా పార్టీని ఇంకా ప్రారంభించలేదు. అయినా మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను" అని పేర్కొన్నారు .





Untitled Document
Advertisements