వైరల్ : ధోని- జీవా వీడియో..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 12:38 PM

వైరల్ : ధోని- జీవా వీడియో..

పుణె, మే 21 : టీమిండియా మాజీ క్రికెటర్ ధోని, ఆయన గారాలపట్టీ జీవా మధ్య కొన్ని సరదా సన్నివేశాలు ఈ మధ్య అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు అభిమానుల్ని విపరీతంగా అలరిస్తుంది. ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌... కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

మ్యాచ్‌ అనంతరం అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరుగుతోన్న సమయంలో మైదానంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ధోనీ తన గారాలపట్టీ జీవాతో కలిసి సరదాగా ఆడుకుంటూ కనిపించాడు. ఆ సమయంలో జీవా తన తండ్రి ధోనీ తలపై ఉన్న టోపీ తీయడం ఆ తర్వాత పెడుతూ కనిపించింది. మైదానంలో జీవా ఆనందంతో గెంతులేస్తూ కనిపించింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫొటోలు చూసిన అభిమానులు కూడా సరదా కామెంట్లు పెడుతున్నారు. నిన్న మ్యాచ్ గెలుపుతో చెన్నై 9 విజయాలతో సన్‌రైజర్స్‌ను సమం చేసినప్పటికీ.. నెట్‌రన్‌రేట్‌లో స్వల్ప తేడాతో వెనుకబడటంతో రెండో స్థానానికి పరిమితమైంది. సన్‌రైజర్స్‌దే అగ్రస్థానం అయింది.Untitled Document
Advertisements