నేను ఇప్పటికీ మిస్ యూనివర్స్ నే : సుస్మితా

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 12:39 PM

నేను ఇప్పటికీ మిస్ యూనివర్స్ నే : సుస్మితా

ముంబై, మే 21 : మాజీ విశ్వ సుందరీ.. బాలీవుడ్‌ బ్యూటీ సుస్మితా సేన్‌ విశ్వసుందరి కిరీటం సాధించి నేటికి 24ఏళ్లు అవుతోంది. ఆమె తన 18 ఏళ్ళ వయసుల్లో ఆ కిరీటాన్ని అందుకున్నారు. ఆ కిరీటం సాధించి 24 ఏళ్ళు అవుతున్న సందర్భంగా సుస్మితా ఆ క్షణాల్ని గుర్తు చేసుకున్నారు. తానూ ఇప్పటికీ 'మిస్ యూనివర్స్' నే అంటున్నారు.

"విశ్వసుందరి కిరీటం సాధించినప్పుడు నా వయసు 18. ఇప్పుడు నా వయసు 42. ఇప్పటికీ నేను 'మిస్‌' యూనివర్స్‌నే. ఈ సందర్భంగా నాకు కానుకలు, లెటర్లు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను భారత్‌లో, నా రెండో నివాసమైన ఫిలిప్పీన్స్‌లో వేడుకలు చేసుకోవాలని అనుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

తానూ జీవితంలో చేయాలనుకుంటున్న విషయాలపై స్పందిస్తూ.. 'నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఒకటి చేయాలని ఉంది. అభిమానులు నాపై కురిపిస్తున్న ప్రేమను తిరిగి వారికి పంచాలని ఉంది' అన్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకొని సుస్మితా సేన్.. ముగ్గురు ఆడపిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements