ఐష్.. ఎల్‌కేజీ టైమ్స్‌..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 02:04 PM

ఐష్.. ఎల్‌కేజీ టైమ్స్‌..

ముంబై, మే 21 : బాలీవుడ్ బ్యూటీ, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్.. ప్రాన్స్ లో నిర్వహించిన 71వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తళుక్కున మెరిసి అభిమానులను ఆకట్టుకున్నారు. అక్కడి నుండి ఇటీవల ముంబై చేరుకున్న ఈ భామ కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచారు. ఎప్పటికప్పుడు ఐష్‌ తన ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులను ఖుష్‌ చేస్తున్నారు.

తాజాగా ఐష్‌ పోస్ట్‌ చేసిన ఫొటో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకో తెలుసా.? అది ఐష్‌ ఎల్‌కేజీలో చదువుతున్నప్పటి ఫొటో. "ఎల్‌కేజీ టైమ్స్‌. గ్రేడ్ 1..అప్పట్లో నాది ఆరాధ్య వయసే" అని పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఐశ్వర్య అచ్చం ఆరాధ్య లానే హెయిర్ కట్ తో కనిపించారు. ఐష్ ఈ ఫోటో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 80 వేలకు పైగా లైకులు రావడం విశేషం.

Untitled Document
Advertisements