మరో సారి భయపెట్టనున్న 'అంజలి'..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 02:44 PM

మరో సారి భయపెట్టనున్న 'అంజలి'..

హైదరాబాద్, మే 21 : ప్రస్తుతం టాలీవుడ్ లో హారర్‌ సినిమాలు తెరకెక్కించే విధానం కొత్త పుంతలు తొక్కుతుంది. కొంచెం భయానికి తోడు హాస్యాన్ని జోడించి సరైన పద్దతిలో తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. 'ప్రేమ కథా చిత్రమ్'‌, ' ఆనందో బ్రహ్మ', 'గీతాంజలి' లాంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. పెద్ద స్టార్ లు లేకపోయినా భారీ స్థాయి విజయం సాధించవచ్చని కథానాయక అంజలి నటించిన 'గీతాంజలి' సినిమా నిరూపించింది. కానీ తర్వాత వచ్చిన 'చిత్రాంగద' సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది.

ప్రస్తుతం అంజలి మరో హారర్‌ మూవీలో నటించనున్నట్లు పేర్కొన్నారు. త్రీడీలో తెరకెక్కుతున్న 'లీసా' సినిమాలో ప్రధాన పాత్రలో చేయనున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రముఖ తమిళ సినిమాటోగ్రాఫర్ కమ్ దర్శకుడు పీజీ ముత్తయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సరికొత్త కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం... తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించి హిందీలో డబ్ చేయబోతున్నారు. ఈ మూవీకు రాజు విశ్వనాథ్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.." తెలుగు- తమిళ భాషలు రెండూ తెలిసిన హీరోయిన్ కావాలనే ఉద్దేశంతోనే అంజలిని ఎంపిక చేశాం. అన్ని సినిమాల్లోలా అమాయకత్వంతో పద్ధతిగా కాకుండా ఈ సినిమాలో అందంగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ అంజలిని చూడబోతున్నారు" అని దర్శకుడు వ్యాఖ్యానించారు.


Untitled Document
Advertisements