కీర్తి సురేష్ డబ్బింగ్ వీడియో వైరల్..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 04:13 PM

కీర్తి సురేష్ డబ్బింగ్ వీడియో వైరల్..

హైదరాబాద్, మే 21 : అలనాటి అందాల నటి, సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర వహించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. విడుదలైన నాటి నుండే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అయితే స్వతహాగా మలయాళీ అయిన ఈ భామ తెలుగులో "మహానటి" కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. భాష రాకున్నా.. పట్టుదలతో తెలుగు నేర్చుకొని స్పష్టంగా డైలాగులు చెప్పడమంటే అంత సులువైన విషయం కాదు.

అయితే తాజాగా కీర్తి సురేష్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో క్యూట్ హావాభావాలతో కీర్తి చెబుతున్న డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మి౦చారు. దుల్కర్ సల్మాన్, సమ౦త, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలు పోషించారు.





Untitled Document
Advertisements