ఈ ఫైట్స్ కు "సాహో" అనాల్సిందే..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 05:23 PM

ఈ ఫైట్స్ కు

హైదరాబాద్, మే 21 : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. "బాహుబలి" చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "సాహో". యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర౦లో కేవల౦ యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయట.

తాజా సమాచారం ప్రకారం.. యాక్షన్ సన్నివేశాలు రియాలిస్టిక్ గా ఉండాలని నిజమైన కార్లు.. ట్రక్కులతో ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరించారట. 37 suv కార్లు అలాగే నాలుగు ట్రక్కులు ఢీకొట్టే విధంగా సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించారు. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు దర్శకుడు సుజిత్. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నెయిల్ నితిన్ ముఖేష్ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు.

Untitled Document
Advertisements