మర్పింగ్ కేసులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వర్మ..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 06:56 PM

మర్పింగ్ కేసులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వర్మ..

హైదరాబాద్, మే 21 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం ఏదో ఒక వివాద౦తో వార్తల్లో నిలుస్తుంటారు. వర్మ, నాగార్జున కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం "ఆఫీసర్" ఈ సినిమా వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. 'ఆఫీసర్' సినిమా కథ తనదేనని జయకుమార్ అనే రచయిత వర్మపై ఆరోపణలు చేశాడు. అంతకుముందు మియా మాల్కోవాతో వర్మ తీసిన "జీఎస్టీ" కథ కూడా తనదేనంటూ జయకుమార్ బలంగా వాదించాడు.

ఈ నేపథ్యంలో వర్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. 'తన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి తన పరువు తీశారని' ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫోటోను జయకుమారే.. మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడని వర్మ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.





Untitled Document
Advertisements