'అభిమన్యుడు' ను ఆదరిస్తారని ఆశిస్తున్న : విశాల్

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 07:20 PM

'అభిమన్యుడు' ను ఆదరిస్తారని ఆశిస్తున్న : విశాల్

హైదరాబాద్‌, మే 21 : విశాల్‌ కథానాయకుడిగా తమిళంలో విడుదలైన 'ఇరుంబుతిరై' చిత్రం హిట్ టాక్ తెచ్చుకొంది. సమంత కథానాయకగా, పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయక పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రాన్నితెలుగులో ‘అభిమన్యుడు’గా విడుదల చేయబోతున్నారు. 'అభిమన్యుడు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మంచి స్పందన లభిస్తుందని కథానాయకుడు విశాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఈ సినిమాను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌. పురుషోత్తమన్‌ తెలుగులో సమర్పిస్తున్నారు. జూన్‌ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తున్నట్లు విశాల్‌ ట్వీట్‌ చేశారు. తమిళనాడులో వచ్చిన అద్భుతమైన స్పందనే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఊహిస్తున్నట్లు పేర్కొన్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. వ్యక్తిగత సమాచారాన్ని లీక్‌ చేయడం, హ్యాకింగ్‌ తదితర ఆన్‌లైన్‌ నేరాల గురించి ఈ మూవీను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది.

హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘తమిళ్‌లో ‘ఇరుంబుతిరై’ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అయింది. ‘అభిమన్యుడు’ చిత్రానికి ఆంధ్రపద్రేశ్‌, తెలంగాణాల్లో కూడా తమిళ్‌ లాగే ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తుందని, తెలుగులో కూడా నా కెరీర్‌నే బిగ్గెస్ట్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. ఇక నిర్మాత జి.హరి మాట్లాడుతూ.. ‘జూన్‌ 1న ‘అభిమన్యుడు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మే 25న ఆడియో ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. తెలుగులో ఈ చిత్రం తమిళ్‌ కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది’ అని చెప్పారు.

Untitled Document
Advertisements