సఫారీ దెబ్బకు సన్‌రైజర్స్‌ స్టన్..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 10:22 AM

సఫారీ దెబ్బకు సన్‌రైజర్స్‌ స్టన్..

ముంబై, మే 23 : ఐపీఎల్ అంటేనే ఎదో మజా.. ఏ ఓవర్ కు ఫలితం మారిపోతుందో చెప్పలేం..టీ20ల్లో ఒక్క ఓవర్‌.. ఒకే ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ గమనాన్ని ఎలా మార్చేస్తుందో మరోసారి నిరూపితం అయింది. ఓపిక.. పట్టుదల.. కసి చివరకు విజయాన్నే అందిస్తాయని మళ్లీ స్పష్టమైంది. అందుకు తగ్గట్టు ఈ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. టోర్నీలో భాగంగా సన్ రైజర్స్ హైదరబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ కోసం ఎంతా చెప్పిన తక్కువే.

గెలుపు కోసం సన్‌రైజర్స్‌ , సూపర్ కింగ్స్ పోరాడిన తీరు చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. సఫారీ నాయకుడు ఫాప్‌ డుస్లెసిస్‌ (67 నాటౌట్‌; 42 బంతుల్లో 5×4, 4×6) చిరస్మరణీయ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. డుప్లెసిస్‌ పోరాటానికి ఆఖర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (15 నాటౌట్‌; 5 బంతుల్లో 3×4) మెరుపులు తోడవడంతో లక్ష్యాన్ని చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

టాస్ నెగ్గిన చెన్నై సారథి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టుకు ఆరంభంలోనే షాక్ కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్(0) దీపక్ చాహార్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఇక అక్కడి నుండి ఆ జట్టు ఆట పేలవంగా సాగింది. ఒక దశలో సన్‌రైజర్స్‌ స్కోరు 19 ఓవర్‌కు 119/6 గా నిలిచింది. కానీ చివరిలో బ్రాత్‌వైట్‌ (43 నాటౌట్‌; 29 బంతుల్లో 1×4, 4×6) మెరుపులు మెరిపించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది.


అనంతరం స్వల్ప లక్ష్య ఛేదన కు బరిలోకి దిగిన ధోని సేన ను హైదరాబాద్ జట్టు బౌలింగ్ తో వణికించింది. చెన్నై బ్యాటింగ్ లో వాట్సన్(0), రైనా(22), రాయుడు(0), ధోని(9), బ్రావో(7), హర్భజన్ సింగ్(2), దీపక్ చాహార్(10), విఫలమైన... మరో ఎండ్ లో డుస్లెసిస్‌ మాత్రం పట్టు వదలకుండా పోరాటం చేశాడు. ఒక దశలో మ్యాచ్ పై పట్టు సాధించిన హైదరాబాద్ ఆఖరిలో తడబడింది. అతనికి తోడు శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా రాణించాడు. దీంతో చెన్నై జట్టు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. రషీద్‌ ఖాన్‌ (2/11), భువనేశ్వర్‌ (1/14), కౌల్‌ (2/32) గొప్పగా బౌలింగ్‌ చేసినా సన్‌రైజర్స్‌ కు ఓటమి తప్పలేదు. ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు డుప్లెసిస్ కు దక్కింది.









Untitled Document
Advertisements