'మిస్టర్ 360' సంచలన నిర్ణయం..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 05:51 PM

'మిస్టర్ 360' సంచలన నిర్ణయం..

కేప్‌టౌన్‌, మే 23 : క్రికెట్ అభిమానులకు షాక్. దక్షిణాఫ్రికా క్రికెటర్, మిస్టర్ 360 సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లో ఎన్నో సరికొత్త విన్యాసాలను ప్రదర్శిస్తూ అవలీలగా బంతులను సిక్సర్లుగా మలిచే డివిలియర్స్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు ఏబీ వెల్లడించాడు.

తన సమయం వచ్చేసిందని, నిజాయితీగా చెప్పాలంటే తాను అలసిపోయానని ఏబీ అన్నాడు. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టిన నాలుగు రోజుల అనంతరం ఏబీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఐపీఎల్‌ లాంటి టీ20 లీగ్స్‌కు ఏబీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 123 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ 22 సెంచరీల సాయంతో 8765 పరుగులు చేయగా‌, 228 వన్డేలాడిన ఏబీ 25 శతకాల సాయంతో 8577 పరుగులు సాధించాడు. 78 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.








Untitled Document
Advertisements