బ్రాండ్ అంబాసిడర్ గా చెర్రీ..!!

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 06:41 PM

బ్రాండ్ అంబాసిడర్ గా చెర్రీ..!!

హైదరాబాద్, మే 23 : ఈతరం స్టార్స్ ఎక్కువగా బ్రాండ్ల వేటలో పడ్డారు. మహేష్ బాబు.. థమ్స్ అప్, అల్లు అర్జున్.. రెడ్ బస్ యాడ్ లతో సత్తా చాటుతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ కోవలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చేరిపోయారు. బ్రాండ్ల విషయంలో ఆయన కాస్తంత స్పీడ్ పెంచనున్నారట. తాజాగా రామ్ చరణ్.. ఒక మొబైల్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నాడు. హ్యాపీ మొబైల్స్ అనే సంస్థ వారు "ఆ యు రెడీ టు సీ" అంటూ ఒక యాడ్ ఇవ్వడంతో.. అక్కడ ఉన్న ఆర్.సి. అనే పెద్ద అక్షరాలను చూడగానే రామ్ చరణ్ అని అర్దమైపోయింది.

అయితే అల్లు అర్జున్ ఆల్రెడీ.. లాట్ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్. దీంతో మెగా కజిన్స్ భలే ఛాన్స్ పట్టార౦టూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉండడం వల్ల పాపులారిటీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బాలీవుడ్ లో సైతం స్టార్ హీరోలు మంచి బ్రాండ్లను ఫాలో అయిపోతున్నారు. మరింకేంటి మొబైల్ యాడ్ తో మెగా పవర్ స్టార్ రచ్చ చేయనున్నాడన్నమాట.





Untitled Document
Advertisements