ఆ క్రికెటర్ చాలా హాట్ అంటున్న కరీనా..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 07:04 PM

ఆ క్రికెటర్ చాలా హాట్ అంటున్న కరీనా..

హైదరాబాద్, మే 23 : బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్.. ప్రస్తుతం "వీర్ డి వెడ్డింగ్" చిత్రంలో నటిస్తోంది. నిర్మాణాంతర పనులను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం జూన్ 1న విడుదల కాబోతోంది. శాంఖ్‌ ఘోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెబోతో పాటు సోనమ్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. నలుగురు స్నేహితురాళ్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కి౦చారు.

అయితే సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు పెళ్లైన వాళ్ళే కావడం గమనార్హం. నిజానికి వీర్ దే వెడ్డింగ్ రెండు నెలల క్రితమే విడుదల కావలసింది. అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో కరీనా చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ టాక్ షోలో కరీనా కపూర్ పలు విషయాలను పంచుకుంది.

బాగా ఫిట్ గా ఉండే క్రికెటర్ ఎవరు..? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి ఏ మాత్రం తడుముకోకుండా.. 'విరాట్ కోహ్లీ' అని సమాధానమిచ్చింది. విరాట్.. ఫిట్ గా ఉండటమే కాకుండా, చాలా హాట్ గా కూడా ఉంటాడని చెప్పింది. మరో క్రికెటర్ కేన్ విలియంసన్ కూడా చాలా హాట్ గా ఉంటాడని చెప్పింది. తన భర్త సైఫ్ ను తాను చాలా ప్రేమిస్తానని చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements