మాస్ మహారాజా Vs యంగ్ హీరో..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 07:06 PM

మాస్ మహారాజా Vs యంగ్ హీరో..

హైదరాబాద్, మే 23 : శుక్రవారం అంటే.. తెలుగు సినిమాకు పండగ రోజు అనే చెప్పాలి. ఆ రోజు ఇంచుమించు సినిమాలు ధియేటర్లలో సందడి చేస్తాయి. ఎల్లుండి రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఒకటి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' కాగా.. రెండోది యంగ్ హీరో నాగశౌర్య 'అమ్మమ్మగారిల్లు'. ఈ ఇద్దరిలో ఎవరు హిట్ దక్కించుకుంటారో చూడాలి. రవితేజ‘నేల టిక్కెట్టు’కి ముందు వచ్చిన 'టచ్ చేసి చూడు' నిరాశ పరిచింది.

'అమ్మమ్మగారిల్లు' కి ముందు నాగశౌర్య నటించిన సినిమా 'ఛలో'. విమర్శకుల దగ్గర ప్రసంశల పొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధించింది. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. 'టచ్ చేసి చూడు', 'ఛలో' ఒక్క రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాలు ఫిబ్రవరి 2న విడుదలయ్యాయి. నాలుగు నెలల్లో మరోసారి రవితేజ, నాగశౌర్య సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగడం యాదృశ్చికమే కావొచ్చు. అయితే.. ఈసారి హిట్ ఎవరికి వస్తుందోనని సినీపరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రెండు సినిమాలు హిట్టయ్యి, హీరోలు ఇద్దరికి హిట్ వస్తే తెలుగు చిత్రపరిశ్రమకు అంత కంటే ఇంకేం కావాలి చెప్పండి.





Untitled Document
Advertisements