"కాలా" ప్రీ రిలీజ్ హైదరాబాద్ లో..!!

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 02:33 PM


హైదరాబాద్, మే 24 : సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాలా'. వండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై హీరో ధనుష్‌ సినిమాను నిర్మించారు. రజనీ సరసన హుమా ఖురేషి నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ న్యూ లుక్ లో దర్శనమివ్వనున్నారట. మాఫియా లీడర్ పాత్రే అయినప్పటికీ.. పూర్తి డిఫరెంట్ గా ఉండనుంది. తెలుగు.. తమిళ భాషల్లో ఈ సినిమాను జూన్ 7వ తేదీన ఒకేసారి విడుదల చేస్తారు. ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో జరపాలని చిత్రయూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం హైదరాబాద్ 'నోవాటెల్' హోటల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను జరపనున్నారట. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తోన్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా నానా పటేకర్ కనిపించనుండటం విశేషం. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. రజినీ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అని అభిమానులు భావిస్తున్నారు.





Untitled Document
Advertisements