మరోసారి తల్లి కానున్న అగ్ర హీరోయిన్..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 03:00 PM

మరోసారి తల్లి కానున్న అగ్ర హీరోయిన్..

హైదరాబాద్, మే 24 : అగ్ర‌ హీరోయిన్ రంభ ఇంట్లోకి మరో బుల్లి పాపాయి రానుంది. ఇదివరకే రంభ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రంభ మ‌రోసారి గ‌ర్భ‌వ‌తి అయినట్లు స్వ‌యంగా ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. 2010 వ సంవత్సరంలో ఇంద్రన్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా కుటుంబానికే సమయాన్ని కేటాయించింది.

స్టార్ హీరోయిన్ గా కెరీర్ ని చాలా కాలం ఎంజాయ్ చేసిన రంభ.. ఆనాటి అగ్ర హీరోలందరితోనూ నటించడమే కాదు మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అప్పట్లో తనకున్న క్రేజ్ అలాంటిది మరి. తాజాగా త‌న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన రంభ‌.. మూడో సారి తల్లవుతున్నందుకు చాలా గర్వంగా ఉందని ఇలా మీ అందరితో సంతోషాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు జాగ్రత్త అని, మీ డెలివరీ క్షేమంగా జరగాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.





Untitled Document
Advertisements