సతీమణికి 'చై' సవాల్..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 04:36 PM

సతీమణికి 'చై' సవాల్..

హైదరాబాద్, మే 24 : సోషల్ మీడియాలో ప్ర‌స్తుత౦ ఛాలెంజ్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. ఐస్‌బ‌కెట్ ఛాలెంజ్ మాదిరి మరో ఛాలెంజ్ హావా నడుస్తోంది. ఒలింపిక్ ప‌త‌క విజేత రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ఓ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. "హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్‌" హ్య‌ష్‌ట్యాగ్‌తో ఆయ‌న పలువురు సెల‌బ్రిటీల‌కు చాలెంజ్‌లు విసిరాడు. వారిలో హైదరాబాదీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఉన్నారు. ఆమె వ్యాయామం చేస్తూ.. పీవీ సింధుకు ఛాలెంజ్ విసరగా.. ఆమె అక్కినేని అఖిల్ కు సవాల్ విసిరింది.

అక్కినేని అఖిల్ తను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ఆ ఛాలెంజ్‌ను తన అన్న నాగ చైతన్య, తండ్రి నాగార్జునకు సవాల్ విసిరాడు. తమ్ముడి ఛాలెంజ్ స్వీకరించిన అన్న నాగ చైతన్య.. జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ పుషప్స్ తో పాటు పలు రకాల వ్యాయామాలు చేస్తూ 52 సెకన్ల వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. అలాగే తన శ్రీమతి సమంతతో పాటు సినీనటులు సుశాంత్‌, నిధి అగర్వాల్‌కి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసిరాడు. మొత్తానికి ఈ ఛాలెంజ్‌ ఫిట్‌నెస్‌ దేశ ప్రజలకు అవగాహన కల్పించాలని.. ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సెలబ్రిటీలు సూచిస్తున్నారు. మరి ఈ ఛాలెంజ్‌ను సమ౦త స్వీకరించి ఎవరెవరికి సవాలు విసురుతుందో వేచిచూడాలి.







Untitled Document
Advertisements