సోదరి సన్ తో 'చందమామ' బ్యూటీ..

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 06:31 PM

సోదరి సన్ తో 'చందమామ' బ్యూటీ..

హైదరాబాద్, మే 24 : సినీ రంగ ప్రవేశం చేసి దశాబ్దకాలం పైనే కావస్తున్నా.. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళ భాషలలో నటిస్తూ పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు.. ఇప్పట్లో అలాంటి ఆలోచనలు లేవు అంటూ నవేస్తోంది. అయితే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ మాత్రం పెళ్లి చేసుకొని కుటుంబంతో గడుపుతోంది.

నిషా పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ఇషాన్ అని పేరు పెట్టారు. అయితే వీలు కుదిరినప్పుడల్లా ఇషాన్ తో ఆడుకుంటూ ఫోటోల మీద ఫోటోలు దిగేస్తోంది. ప్రస్తుతం కాజల్ తన చెల్లెలు కుమారుడితో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వావ్ చాలా అందంగా ఉన్నారు. క్యూటెస్ట్ ఫోటో అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.





Untitled Document
Advertisements