క్రికెటర్ తండ్రి దారుణ హత్య..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 11:18 AM

క్రికెటర్ తండ్రి దారుణ హత్య..

కొలంబో, మే 25 : శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్‌ దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్‌పై కొలంబో శివారు ప్రాంతంలోని రత్మలానా వద్ద దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రంజన్ అక్కడికక్కడే మరణించారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుండి ధనుంజయ వైదొలిగాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు బయల్దేరాల్సి ఉంది. దీనిపై విచారణ చేపట్టామని, ఇప్పటి వరకు ఎవర్ని అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు. తండ్రి మరణంతో ధనుంజయ వెస్టిండీస్‌ వెళ్లే లంక జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.అతని స్థానంలో ఎవర్ని వెస్టిండీస్‌ పర్యటనకు పంపిస్తున్నారో శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. జూన్‌ 6 నుంచి శ్రీలంక-వెస్టిండీస్‌ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది.

Untitled Document
Advertisements