హరితేజ ఘటనపై ఘాటుగా స్పందించిన తమ్మారెడ్డి..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 01:16 PM

హరితేజ ఘటనపై ఘాటుగా స్పందించిన తమ్మారెడ్డి..

హైదరాబాద్, మే 25 : టాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌ హరితేజకు ధియేటర్ లో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. "మహానటి" సినిమాను చూడటానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. సినిమా థియేటర్ లో ఇద్దరు తల్లీ కూతుళ్లు హరితేజ కుటుంబంతో వాగ్వాదానికి దిగగా.. తన కుమార్తె పక్కన హరితేజ తండ్రి కూర్చోరాదని ఓ మహిళ వాదించి౦ది. మా నాన్న పక్కన కూర్చోడానికి ఇబ్బంది ఏ౦టని హరితేజ ప్రశ్నించగా.. మగాళ్ల పక్కన కూర్చోడానికి తామేమీ సినిమా వాళ్లం కాదని గట్టిగానే చెప్పింది.

ఈ మాటలతో హర్ట్ అయిన హరితేజ, తాను ఎదుర్కొన్న ఘటనపై సోషల్ మీడియాలో భావోద్వేగపు పోస్టు పెట్టింది. ఈ వీడియో చూసిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్రంగా స్పందించారు. "సదరు ప్రేక్షకురాలేమైనా పతివ్రత అన్న సర్టిఫికెట్ తో థియేటర్ కు వచ్చిందా"? అని ప్రశ్నించారు. తన మాటలు బాధపెడితే క్షమించాలని అంటూనే.. సినిమావాళ్లను చిన్న చూపుచూడవద్దని, వారూ మామూలు మనుషులేనని, తాము ప్రేక్షకులను దేవుళ్లుగా చూస్తామని చెప్పుకొచ్చారు.

Untitled Document
Advertisements