ట్రాఫిక్ ఉల్లం'ఘనుల'పై కొరడా..

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 02:34 PM

ట్రాఫిక్ ఉల్లం'ఘనుల'పై కొరడా..

హైదరాబాద్, మే 25 : ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధిస్తామని తెలంగాణ ఐటీ ముఖ్యమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ నిర్వహించిన "మన నగరం" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నగరంలో అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగర౦లో ఆర్టీసీ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. మూడో దశ మెట్రోను అక్టోబర్‌లో ప్రారంభిస్తామని వెల్లడించారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అలాగే నగరవాసులకు సంతృప్తికర స్థితిలో తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఇందుకోసం పాత పైపులైన్లను తీసేసి కొత్తవి ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలోని 54 నాలాలకు వికేంద్రీకరణ పద్ధతిలో ఒక్కొక్క నాలాకు ఒక్కో మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరం కావాలంటే అన్ని మౌలిక వసతులు కావాలని.. ప్రజల భాగస్వామ్యముంటేనే నగరాన్ని అభివృద్ధి చేయగలమని వెల్లడించారు.





Untitled Document
Advertisements